
హైదరాబాద్, వెలుగు: మరో వారం రోజుల్లో బీటెక్‌లోని పలు బ్రాంచీలకు కొత్త సిలబస్ అమలు కాబోతున్నది. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో వివిధ యూనివర్సిటీల బీఏసీ చైర్మన్లు, సబ్జెక్టు నిపుణులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిలబస్ కమిటీ పలుమార్లు సమావేశమై, రూపొందించిన కొత్త సిలబస్‌ను మీటింగ్‌లో చర్చించారు. ప్రధానంగా ఎమర్జింగ్ టెక్నాలజీ మైనర్ డిగ్రీ కోర్సులు, సివిల్ బ్రాంచితో పాటు పలు కొత్త కోర్సుల్లో సిలబస్ రూపొందించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్‌ను అధికారులు రూపొందించారు.